ఈ అమ్మడు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో నటిస్తున్న మంచి పేరే తెచ్చుకుంది. ఈమెకు ఎవరంటే ఇష్టం అని అడిగితే శ్రీదేవి అంటూ టక్కున సమాధానం ఇచ్చింది.
అంతే కాదు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో... మాటల్లో చెప్పలేనంటోందీ బ్యూటీ. శ్రీదేవి, కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమాను ఎన్నిసార్లు చూశానో... ఆ చిత్రంలో శ్రీదేవి నటన అద్భుతం. అప్పటి నుంచి తానామెను మరచిపోలేకపోయానంది.