డబ్బుకు డబ్బు.. క్రేజ్‌కు క్రేజ్: ఐటమ్ గర్ల్‌గా సీమటపాకాయ్ పూర్ణ!

శుక్రవారం, 17 అక్టోబరు 2014 (13:28 IST)
ఐటెం సాంగ్స్ ఫీవర్స్ ఏకంగా టాప్ హీరోయిన్స్‌కు తాకిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే నామోషీగా ఫీలయ్యే హీరోయిన్లు ప్రస్తుతం ఐటమ్ సాంగ్ అంటే వెంటనే ఓకే చెప్పేస్తున్నారట. తమన్నా, చార్మి, శ్రియా, శృతిహాసన్ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు.  
 
ఇప్పుడీ కోవలో మలయాళ భామ పూర్ణ కూడా చేరింది. కథానాయికగా అవకాశాలు తక్కువగా ఉండడంతో ఇక ఈ తరహా గీతాలకు స్టెప్పులేసేందుకు పూర్ణ సై అంటోంది. 
 
తాజాగా జయం రవి హీరోగా నటిస్తున్న 'అప్పా టక్కర్' అనే తమిళ సినిమాలో ఐటెం సాంగు చేయడానికి పూర్ణ ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి