పవన్ కళ్యాణ్ ను పదేపదే పిలుస్తున్న రేణూ దేశాయ్... వస్తాడా...? రాడా..?

మంగళవారం, 26 ఆగస్టు 2014 (20:20 IST)
హై సొసైటీలో భార్యభర్తలు విడిపోయినా.. మళ్ళీ మళ్ళీ ఏదో సందర్భంలో కలుస్తూనే వుంటారు. చూసేవారికి అదో వింతగా అనిపిస్తుంది. మీడియాకు మాంచి మేటర్‌ దొరుకుతుంది. టాలీవుడ్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల అంశం కూడా అటువంటిదే. ఇటీవలే వేరువేరుగా వుంటున్నా... అడపాదడపా కలుస్తూనే వున్నారని వార్తలు తిరుగుతున్నాయి.
 
మరాఠీలో సినిమా తీసిన రేణు దేశాయ్‌ భార్యభర్తల సంబంధాల గురించి చెప్పింది. దానికితోడు టాలీవుడ్‌కు చెందిన కథను తీసుకుని కొత్తవారితో అక్కడ ఓ సినిమాను తీసింది. ఆ చిత్రం టీజర్‌కు పవన్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 2న... అంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు దానికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం.
 
ఐతే అదేరోజు పవన్‌ కుటుంబీకులకు చెందిన ఓ కార్యక్రమం కూడా వుంది. మరి పవర్ స్టార్ దేనికి అటెండ్‌ అవుతాడో అభిమానులకు ఆసక్తికరంగా వుంది. రేణూ దేశాయ్ మాత్రం ఆడియో, టీజర్ అంటూ పవన్ కళ్యాణ్ ను పదేపదే ఆహ్వానిస్తూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి