ఈ ఇద్దరూ ఆయన మొదటి భార్య లలితకుమారి పిల్లలు. ఆమెకు విడాకులిచ్చినప్పటికీ, ప్రకాశ్ రాజ్ తన పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇటీవల పూజ తన స్నేహితుడితో కలసి సరదాగా ఓ ఇంగ్లిష్ పాట పాడింది. ‘i will follow you into the dark’ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది.
ఇది ఓ తండ్రిగా నేను చాలా గర్వపడాల్సిన విషయం. అందుకే ఆ వీడియోను ఆనందంగా షేర్ చేస్తున్నాను. ఛీర్స్” అంటూ ట్విట్టర్లో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు కోలీవుడ్ ప్రముఖులు పూజ చాలా బాగా పాడిందని ప్రకాశ్‌కు ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట. అంతేకాకుండా ట్విట్టర్లో పూజ సాంగ్‌కు సూపర్ కామెంట్స్ వస్తున్నాయట.