ఆదిత్యరామ్‌కు ప్రతిష్ఠాత్మక 'బెస్ట్‌ రియాలిటీ బ్రాండ్స్‌ 2015' అవార్డు

శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:47 IST)
ఆదిత్యరామ్‌ మూవీస్‌ పతాకంపై సందడే సందడి, ఖుషిఖుషిగా, ఏక్‌నిరంజన్‌, స్వాగతం వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన ఆదిత్యరామ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్యరామ్‌కు ప్రతి ఏటా ది ఎకనమిక్‌ టైమ్స్‌ అందించే ప్రతిష్ఠాత్మక 'ది బెస్ట్‌ రియాలిటీ బ్రాండ్‌' అవార్డును అందుకున్నారు. 
 
చిత్ర నిర్మాతగానే కాకుండా రియల్‌ ఎస్టేట్‌, మూవీ అండ్‌ టి.వి. స్టూడియో, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌, ఇన్‌వెస్ట్‌మెంట్‌ సెక్టార్‌.. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆదిత్యరామ్‌కి 2015 సంవత్సరానికిగాను ఈ అవార్డు లభించింది. ది ఎకనమిక్‌ టైమ్స్‌ ఓ సర్వేను నిర్వహించి రియల్‌ ఎస్టేట్‌లో బెస్ట్‌ బ్రాండ్స్‌ని సెలెక్ట్‌ చేసింది. అందులో ఆదిత్యరామ్‌ గ్రూప్‌కి ఈ అవార్డు దక్కింది. 
 
ఆదిత్యరామ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రెండు దశాబ్దాల్లో 15 మిలియన్ల స్క్వేర్‌ ఫీట్స్‌ని డెవలప్‌ చేసి కస్టమర్లకు అందించింది. వివాదాలకు తావు లేకుండా నిర్మాణాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది ఆదిత్యరామ్‌ సంస్థ. 

వెబ్దునియా పై చదవండి