ఆ తర్వాత నవంబర్ మూడో వారంలో తెలుగు వెర్షన్ ఆడియో కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. డిసెంబర్ 12న రజనీ జన్మదినం రోజున ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఇప్పటికే నిర్ణయించారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటించారు.