ప్రిన్స్‌తో ఛాన్స్ మిస్.. అల్లు అర్జున్ సరసకు రకుల్ సై

శుక్రవారం, 26 జూన్ 2015 (09:58 IST)
టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుసగా వస్తున్న ఆఫర్లతో అమ్మడు బిజి బిజీగా ఉంది. ఈ బ్యూటీకి మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటిస్తుండడంతో డేట్స్ కుదరక నో చెప్పేసింది. తాజాగా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన చేసే అవకాశం వరించింది.
 
 
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ని అడుగుతున్నట్టు సమాచారం. అసలే మహేశ్ ఛాన్స్‌ను వదులుకున్న ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన చేరేందుకు డేట్స్ సర్దుబాటు చేసుకుని సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అవసరం.

వెబ్దునియా పై చదవండి