సెక్సీ లుక్స్‌తో అదరగొడుతున్న రకుల్ ప్రీత్... గబ్బర్ సింగ్ 2లోనూ...

సోమవారం, 20 అక్టోబరు 2014 (19:51 IST)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ జోరు పెంచింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2లో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే రకుల్ కావలసినంత మేరకు ఎక్స్‌పోజింగ్ చేసేందుకు సిద్ధమని అంటోందట. దాంతో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ఎగబడుతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే రకుల్ చేతిలోకి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. 
 
ఇప్పటికే ఆది రఫ్ చిత్రంలో నటిస్తున్న రకుల్ మరో హిందీ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే కరెంటు తీగలోనూ మంచు మనోజ్ సరసన నటిస్తోంది. ఇంకా పవన్ కళ్యాణ్ తోపాటు మరికొందరు అగ్రహీరోల సరసన నటించే ఛాన్సులు పలుకరిస్తున్నాయంటున్నారు. సెక్సీ లుక్స్ కు అభ్యంతరం చెప్పకపోతే ఆఫర్లు వరద రాక ఏమవుతుందీ అంటున్నారు సినీజనం.

వెబ్దునియా పై చదవండి