ప్రతిక్షణం వివాదాలను కొనితెచ్చుకునే రాంగోపాల్ వర్మ సినిమాలో నటించకూడదని రానా డిసైడైపోయాడని తెలిసింది. 'గొలుసు' సినిమా కథ నచ్చి ఆ సినిమాలో నటించాలని ముందుగా రానా భావించాడు. కానీ డేట్స్ ఖాళీలేకపోవడంతో వర్మ సినిమాలో నటించేది లేదని ఖరాఖండిగా చెప్పేశాడట. ఇందుకు డేట్స్ కారణం కాదని.. వర్మ వివాదాల వలలో పడటం ఎందుకని రానా మెల్లగా జారుకున్నట్లు సమాచారం.
ఈ కారణంగా, 'గొలుసు' నుంచి రానా అయిష్టంగానే తప్పుకున్నాడని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాలు అంటున్నాయి. దీంతో, రాంగోపాల్ వర్మ తన చిత్ర కథకు సరిపోయే మరో హీరో కోసం అన్వేషణలో పడ్డాడని ఫిలింనగర్ సమాచారం.