ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక రాశి. పెళ్లి చేసుకుని, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాశి, మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు సమాచారాన్ని చేరవేస్తోంది.
తాను మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని చెబుతోందట. నదియా లాంటి తారలు చేస్తున్న పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని అడుగుతోందని అంటున్నారు. అయితే, హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా మాత్రం నటించనని కండిషన్ పెడుతున్నట్టు చెబుతున్నారు. అక్క, ఆంటీ పాత్రలకు రెడీ అని అంటోంది రాశి. మరి ఆమె కోరుతున్నట్టు అవకాశాలు వస్తాయో రావో, వేచి చూడాలి.