సినిమాను వంద రోజులు వెండితెరపై ఆడించేందుకు దర్శక నిర్మాతలు పడరాని పాట్లు పడుతుంటారు. అందులో భాగంగా ఇతర భాషల్లో ప్రముఖ హీరోలుగా ఉన్న వారిని తమ సినిమాలలో నటింప చేస్తారు. తద్వారా సినిమాకు ఆకర్షణ కొంత మేర పెరుగుతుంది. ఈ కోవలో ఒక కన్నడ చిత్రంలో హీరో శివరాజ్‌తో పాటు ఇతర భాషల హీరోలు కొందరు నటించారు. వారిలో టాలీవుడ్ హీరో రవితేజ కూడా ఉన్నారు.
శనివారం జరిపిన ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్లో రజవితే పాల్గొన్నారు. ఇందులో శివరాజ్ కుమార్ తో కలసి ఈ పాటలో రవి మాస్ స్టెప్స్ వేశాడు. ఇంకా ఈ పాటలో తమిళ హీరో శివ కార్తికేయన్, మలయాళ హీరో దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్‌లు కూడా నటించారు.