అకీరా నందన్ పోస్టర్ రిలీజ్... 'ఇష్క్ వాలా లవ్' వాయిదా!

సోమవారం, 20 అక్టోబరు 2014 (11:06 IST)
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఇష్క్ వాలా లవ్' మరాఠీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్టు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల రీత్యా మళ్లీ వాయిదా వేసి,  ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నట్టు రేణూదేశాయ్ ఇటీవల ప్రకటించింది. అయితే, ఇప్పుడు అది కూడా వాయిదా పడినట్టు సమాచారం. 
 
తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయించలేదని రేణు తాజాగా పేర్కొంది. ఖరారు కాగానే అభిమానులతో ఆ వార్తను పంచుకుంటానని ఆమె ట్వీట్ చేసింది. కాగా, ఈ సినిమాలో పవన్-రేణుల తనయుడు అకీరా నందన్ గెస్ట్ పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. అందుకు సంబంధించిన తాజా పోస్టర్ను ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి