అకీరా నడుస్తుంటే అచ్చం పవన్ నడిచినట్లే ఉంటుందట. ఇంకా అతడు పవన్ ఇష్టపడే ఫుడ్ ఐటెమ్స్ ను తింటాడట. అలాగే పవన్ మాదిరిగానే అకిరాకు కూడా ఫంక్షన్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదనీ, అలాగే ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా తనకు ఇష్టముండదని చెప్పింది. తన పుట్టినరోజునాడు ఎటువంటి పార్టీలు వద్దని చెప్పిన అకిరా దానికయ్యే ఖర్చును ఏదైనా అనాధ ఆశ్రమానికి ఇద్దామని తనను బలవంతపెడతాడని చెప్పింది రేణు దేశాయ్.