సహజీవనం కోసం తహతహలు... ఫ్లాట్ వేటలో అలియా భట్..

గురువారం, 28 మే 2015 (15:30 IST)
ప్రేమించిన వాడిని పక్కనెట్టుకొని దూరంగా ఉండలేకపోతోంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అందుకే ఆయన సరసకు చేరి నలిగిపోవాలని తహతహలాడుతోంది. సిద్దార్థ్, అలియా భట్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కలసి పబ్ లు, క్లబ్ లు అంటూ చెట్టాపట్టా లేసుకొని తెగ తిరుగుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే వారిని ఎప్పుడు అడిగానా అబ్బే, మా ఇద్దరి మధ్య అటువంటిదేమి లేదు అంటూ జారుకుపోతున్నారు. ఇక ఎన్నాళ్ళు ఈ దాగుడుమూతలు అనుకున్నారో ఏమో కానీ సహజీవనం చేయాలనీ అనుకుంటున్నారట. అందుకోసం ముంబైలో ఒక ఫ్లాట్ కోసం ఇద్దరు కలిసి తెగ తిరిగుతున్నారట. 

వెబ్దునియా పై చదవండి