హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్ ఎట్టకేలకు బోనెక్కి సరికొత్త సాక్ష్యం ఇచ్చాడు. 2002లో కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమై, నలుగురిని గాయపరిచారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్.. శుక్రవారం కోర్టు విచారణకు హాజరై తన వాదనను వినిపించుకున్నారు.
కాగా 2002లో మద్యం మత్తులో కారు నడిపి ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్నఒకరు మరణించడానికి, నలుగురు గాయపడేందుకు కారణమైన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే సల్మాన్ కారు నడిపినట్లు ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు ముంబై సెషన్స్ కోర్టుకు నివేదించారు.