సమంతకు సమంత ముద్దొచ్చింది.. లవ్యూ బేబీ!!

శనివారం, 22 నవంబరు 2014 (18:18 IST)
సమంతకు సమంత ముద్దొచ్చిందా? ఇదేంటి అనుకుంటున్నారా? సాధారణంగా మనం కొత్త బట్టలు తీసుకున్న తరువాత అద్దం ముందు ఒకటికి పది సార్లు చూసుకుని మురిసిపోతుంటాం కదా? అలాగే సమంతకు డిజైనర్ క్రెషా బజాజ్ డిజైన్ చేసిన బట్టలు అందాయి. వాటిని వేసి చూసుకున్న సమంత ముచ్చటపడిపోయి.. తన అందాన్ని తానే మెచ్చుకుంది. 
 
అంతేగాకుండా ఆ అందాన్ని ఫోటో షూట్ చేయించుకుని, కొత్త బట్టలతో ఉన్న ఫోటోలు అభిమానుల కోసం ట్వీట్ చేసింది. నలుపు తెలుపు కాంబినేషన్ గౌనులో తనను తాను చూసుకున్న సమంత లవ్యూ బేబీ అంటూ కితాబిచ్చుకుంది.

వెబ్దునియా పై చదవండి