ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాల్లో ముచ్చటగా మూడుసార్లు జతకట్టిన సమంత, నాగచైతన్య నాలుగోసారి కూడా జతకడుతారని అభిమానులందరూ ఆసక్తితో ఎదురుచూశారు. అయితే సమంత చాలా బిజీగా ఉండటంతో నాగచైతన్య సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా గౌతమ్ సార్‌కి సమంత సారీ కూడా చెప్పిందని.. తమిళంలో బిగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయలేకే ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు చెప్పిందని సమాచారం. దీంతో గౌతమ్ హీరోయిన్ వేటలో పడ్డారు. అచ్చం ఎన్బదు మడమయడా.. అనే సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది.