ఒబామా అలా అన్నందుకు షారూఖ్‌ ఆనందం.. సెటైర్‌...

బుధవారం, 28 జనవరి 2015 (21:55 IST)
బాలీవుడ్‌ నటుడు ఒకవైపు ఆనందంతో పాటు మరోవైపు చిన్నపాటి అసహనానికి గురయ్యాడు. అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా తన ప్రంసంగంలో లింగ, మత సమానత్వంపై మాట్లాడుతూ... బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ పేరు, క్రీడాకారుడు మిల్కా సింగ్‌ను, మేరీకోమ్‌ను ప్రస్తావించారు. 
 
దీంతో షారూఖ్‌ చాలా ఆనందంగంతో ఒబామాకు థ్యాంక్స్‌ చెప్పారు. ఇక మరోవైపు ఇటీవల సినిమా పురస్కారాలను ప్రకటించిన ఫిలింఫేర్‌ అవార్డులో షారూఖ్‌ పేరు లేదు. దాని గురించి కొందరు అడిగితే.. హ్యాపీ న్యూఇయర్‌‌లో వారు ఆశించిన స్థాయిలో నేను నటించలేకపోయానేమో అని జవాబిచ్చారు. ఆ సినిమా బాక్సీఫీసు వద్ద మంచి వసూళ్లు చేసింది. కానీ నటన ప్రదర్శించలేకపోయానని చెబుతున్నారు మరి.

వెబ్దునియా పై చదవండి