శంకర్ "ఐ" టీజర్ రికార్డ్స్.. 12 గంటల్లో 10 లక్షల హిట్స్..

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (18:31 IST)
'శంకర్ సినిమా 'ఐ' టీజర్ ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్ విడుదలైన ఒక్క రోజునే లక్షల్లో హిట్స్ కొట్టేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఏపాటిదో మరోసారి రుజువైంది. ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం రాత్రి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి విదితమే. 
 
హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్, రజనీకాంత్ పునీత్ రాజ్ కుమార్ వంటి హేమాహేమీల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో వీరవిహారం చేసేస్తోంది. దీనిని విడుదల చేసిన 12 గంటల్లోనే పది లక్షల హిట్స్‌ను ఇది సొంతం చేసుకుని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ట్రైలర్‌ను హాలీవుడ్ సినిమా రేంజిలో కట్ చేయడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. 


 

వెబ్దునియా పై చదవండి