2012, 2013 సంవత్సరాల్లో సినీ ఛాన్సులు లేకుండా ఖాళీగా ఉండిన శ్రియ.. ఒక్కసారిగా తమిళం, తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో బిజీ బిజీ అయిపోయిందట. ఒకప్పుడు దక్షిణాది సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన శ్రియ.. మధ్యలో సినీ ఛాన్సులకు దూరమైంది.
తమిళంలో సూపర్ స్టార్ శివాజీ సరసన నటించినా, తెలుగులో పవిత్రలో వేశ్యగా శ్రియ హాట్ లుక్ ఇచ్చినా.. ఫలితం లేకపోయింది. కానీ మనం సినిమా శ్రియ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. దీంతో శ్రియకు అవకాశాలు మెండుగా వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్.