పవన్‌కళ్యాణ్‌ను కలిసిన శ్రీజ పేరెంట్స్... పవన్ పై కోన పొగడ్తలు

సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:15 IST)
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడి పవన్ కళ్యాణ్ చేతి చలువతో కోలుకున్న శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు టాలీవుడ్ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శ్రీజ తన సోదరి, తల్లిదండ్రులతో కలిసి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సంభాషించారు. 

 
శ్రీజను పవన్‌కళ్యాణ్ ఖమ్మం లోని ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పరామర్శించి, ఆమె ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. కాగా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ పైన మాటల రచయిత, దర్శకుడు కోన వెంకట్ పొగడ్తల జల్లు కురిపించారు. అదేమిటో చూడండి.
 

వెబ్దునియా పై చదవండి