శ్రీకాంత్‌కు నచ్చిన జరైన్ ఖాన్... పిలిపించారట...!

బుధవారం, 11 మార్చి 2015 (18:57 IST)
శ్రీకాంత్‌ చకచకా వంద సినిమాలు పూర్తి చేసేసి సైలెంట్‌ హీరో అయిపోయాడు. ఆయన నటించిన నాటుకోడితో పాటు మూడు చిత్రాలు విడుదలకు రెడీగా వున్నాయి. దానికితోడు ఆయన చిత్రాలు పెద్దగా సక్సెస్‌ కూడా కావు. నిర్మాతలకు సేఫ్‌లా అనిపిస్తుంది. అందుకే చిత్రాలు తెగ చేసేస్తున్నాడు. తాజాగా సుధీర్‌ రాజ్‌ దర్శకత్వంలో చేయనున్న చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.
 
కానీ అందులో కొత్తగా అనిపించే అమ్మాయి అయితే బాగుంటుందని జరైన్‌ఖాన్‌ను పిలవమన్నాడట. దాంతో నిర్మాతలు ఆమెను పట్టుకుని ఒప్పించారు. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఆమెను పరిచయం చేశాడు. తమిళంలో కూడా కరికాలన్‌ సినిమాలో విక్రమ్‌ పక్కన నటించింది. తెలుగులో శ్రీకాంత్‌తో చేస్తే.. కాస్త గ్లామర్‌ లుక్‌తో బిజినెస్‌ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి