ఈ నేపథ్యంలో ఇటీవల గోపీచంద్ హీరోగా 'లౌక్యం' చిత్రాన్ని జనరంజకంగా రూపొందించి, భారీ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నుంచి కూడా పెద్ద ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం.
ఇటీవల 'లౌక్యం' చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలసి వీక్షించిన బాలయ్య, ఆ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశాడట. అనంతరం దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాదు, అతని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంసిద్ధత కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం.