దీనిపై తాప్సీ హ్యాపీగా మాట్లాడుతూ.."అవును ... ఢిల్లీ మా ఊరు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ప్రస్తుతం 'బేబీ' హిందీ సినిమా షూటింగ్ కోసం ఇక్కడే వున్నాను. ఇక్కడి ప్రాంతాలలో షూటింగ్ కోసం తిరుగుతుంటే, చిన్నప్పుడు స్నేహితులతో కలసి తిరిగినప్పటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి.
అలాగే, ఈ సినిమాలో అక్షయ్‌తో కలసి నటిస్తున్నందుకు మరింత ఆనందంగా వుందట. "బాలీవుడ్‌కి వచ్చిన ఆనతి కాలంలోనే అక్షయ్‌తో కలసి సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. చాలా హ్యాపీగా వుంది" అని చెప్పింది. సో.. తాప్సీ హ్యాపీ మూడ్‌కు కారణం అదన్నమాట.