హిందీ దృశ్యంలో ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా టబు: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

శనివారం, 30 మే 2015 (15:33 IST)
హిందీ దృశ్యం రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఐజీ మీరా దేశ్‌ముఖ్ రోల్‌లో టబు నటిస్తోంది. నిషికాంత్ కామత్.. మలయాళ మూవీ దృశ్యంను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగులో దృశ్యంగా, తమిళంలో పాపనాశంగా రీమేక్ అయిన ఈ మూవీ హిందీలో దృశ్యంగా రెడీ అవుతోంది. అజయ్ దేవగణ్ మిడిల్ క్లాజ్ కేబుల్ ఆపరేటర్ పాత్రలో కనిపిస్తుండగా, గ్లామర్ హీరోయిన్ టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టనుంది.  
 
ప్రస్తుతం అవకాశాల్లేక అల్లాడుతున్న టబుకు దృశ్యంలోని ఐజీ రోల్ మంచి గుర్తింపును సాధించిపెడుతుందని తద్వారా అమ్మడికి మంచి ఆఫర్లు వస్తాయని హిందీ సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే.. హిందీ దృశ్యం జూలై 31వ తేదీన రిలీజ్ కానుంది. అజయ్ దేవగణ్ సరసన శ్రేయ నటిస్తుండగా, కూతురిగా రాజత్ కపూర్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి