దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా, బాలీవుడ్లోనూ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ తాప్సీ. ఆ మధ్య తెలుగులో హల్చల్ చేసిన ఈ సొట్టబుగ్గల చిన్నది ఇప్పుడు ముంబయ్, చెన్నయ్ల మధ్య షటిల్ సర్వీస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది.
ఒకే సారి రెండు సినిమాలో చేయాల్సి రావడంతో నాలుగేసి రోజుల చొప్పున మూడు నెలల పాటు ఈ రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చిందట. దాంతో, ఈ అమ్మడు ప్రతి నాలుగు రోజులకు ఓసారి ఈ రెండు నగరాల మధ్య తిరుగుతుంటుందట. పనిలో పనిగా తెలుగు అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట. అందుకోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులతో చర్చిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.