నేటి ట్రెండుకి తగ్గట్టుగా తను కూడా తండ్రి సినిమాలోని ఓ సూపర్ హిట్ పాటను ఇందులో రీమిక్స్ చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నాడట. రెండు దశాబ్దాల క్రితం నాగార్జున నటించిన 'హలో బ్రదర్' చిత్రంలోని 'కన్నెపెట్టరో... కన్ను కొట్టరో' అంటూ సాగే పాట అప్పట్లో పక్కా మాస్ నెంబర్‌గా అందర్నీ ఊపేసింది.