ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ... శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నటుడిగా నేను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. కానీ నేను తప్పుగా మాట్లాడినట్లు సాక్ష్యాలు కూడా చెక్ చేసుకోకుండా నన్ను బహిష్కరిస్తానని అనడం దారుణం. అలా చేయదలిస్తే రాధారవి, ఉపాధ్యక్షులు కెఎల్ కలైలను బహిష్కరించాల్సి ఉంటుంది.