తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల వారసుల హవా సాగుతోంది. తాజాగా మరో హీరో కొడుకు వెండితెరకు పరిచయమవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోకానున్నాడు. గత రెండున్నర దశాబ్దాలుగా హీరోగా వివిధ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ను త్వరలో హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.