వరుణ్ మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ అయిపోయింది!

శనివారం, 24 జనవరి 2015 (11:56 IST)
వరుణ్ మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. త్రిష ఎంగేజ్‌మెంట్ చెన్నైలో శుక్రవారం నాడు అట్టహాసంగా జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా త్రిష-వరుణ్ మణియన్ రింగులు మార్చుకున్నారు. 
 
వరుణ్ మణియన్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో వధూవరుల కుటుంబం, ఇద్దరి స్నేహితులు, సినీ పరిశ్రమలో ఇద్దరికీ సన్నిహితులు పాల్గొన్నారు. నిశ్చితార్థం సందర్భంగా వరుణ్ మణియన్ త్రిషకు విలువైన కానుకలు ఇచ్చారు. 
 
ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన ప్రత్యేక చీరలో త్రిషకు అప్పుడే పెళ్లి కళ్ల ఉట్టిపడింది. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.  

వెబ్దునియా పై చదవండి