ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మలుపు ఉందంటే అది వివాహం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి విలువైన వివాహాన్ని అతి సాధారణ ప్రజలు కూడా తప్పెట్లు, తాళాలతో వైభోగంగా జరుపుకుంటారు. అదే వీవీఐపీలు అయితే ఇక చెప్పేదేముంది కోట్లు కుమ్మరించి వారి స్థాయికి తగ్గట్టు గ్రాండ్గా చేసుకుంటారు.
దక్షిణాది చిత్ర సీమలో అగ్రతారగ మెరిసిపోతున్న చెన్నై సుందరి త్రిష తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మనియన్ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదిన వీరి నిచ్ఛితార్థం కూడా ఫిక్స్ చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా ప్రకటించలేదు.