"గోపాల గోపాల"లో వెంకీ స్టైల్ అదుర్స్!

మంగళవారం, 28 అక్టోబరు 2014 (13:15 IST)
పవన్ కల్యాణ్ వెంకటేష్  కాంబినేషన్‌లో రూపొందున్న లేటెస్ట్ మల్టీస్టారర్ 'గోపాల గోపాల'. ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యాపారి పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. సాధారణంగా, వెంకటేశ్ హీరోగా నటించే ప్రతీ చిత్రంలో ఆయన దుస్తులను పాప్యులర్ కాస్ట్యూమ్ డిజైనర్ చేత డిజైన్ చేయిస్తారు. 
 
అయితే, 'గోపాల గోపాల' చిత్రంలో వెంకటేశ్ తన పాత్రకు కాస్ట్సూమ్స్ తానే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఫైజమా, కుర్తా, జాకెట్స్‌ను వెంకటేశ్ స్వయంగా షాపింగ్ చేసుకుని ఎంపిక చేసుకున్నారని సమాచారం. తన ప్రతీ చిత్రంలో డిజైనర్ వేర్స్‌లో రిచ్‌గా కనిపించే వెంకీ, ఈసారి ఫైజమా.. కుర్తాల్లో నార్మల్‌గా ఉంటూనే క్లాస్‌గా కనిపించనున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి