తమిళనాడు సినీ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌కు ప్రముఖ హీరో, నిర్మాత విశాల్‌కు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నడిగర్ సంఘం సభ్యులపై విశాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకుంటే విశాల్‌ను సంఘం నుంచి తొలగిస్తామని శరత్ హెచ్చరిస్తుంటే... విశాల్ కూడా అంతే ధీటుగా అసోసియేషన్ సభ్యులను అవమానించిన వారిని కూడా తొలగిచాలని డిమాండ్ చేస్తున్నాడు.