ఇలియానా పాట మత్తెక్కిస్తుందట: ప్రేక్షకులకు పండగే పండగ!

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:38 IST)
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం తాను సైఫ్ ఆలీఖాన్ సరసన నటిస్తున్న 'హ్యాపీ ఎండింగ్' సినిమాలో చాలా సెక్సీగా కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా విడుదల చేసిన 'జైసా మేరా తూ... ' పాట అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 
ఇందులో అమ్మడు హాట్ హాట్‌గా, ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా తనకి బాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు తేవడం ఖాయమని ఇలియానా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
ఇందులో గోవిందా, ప్రీతి జింటా మరో జంటగా నటిస్తున్నారు. నవంబర్ 21న రిలీజయ్యే ఈ 'హ్యాపీ ఎండింగ్' చిత్రానికి రాజ్ నిడిమోరు- కృష్ణ డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహిస్తోంది.

వెబ్దునియా పై చదవండి