ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు విజయ్‌కుమార్ కొండా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు సుమన్, సత్యం రాజేష్, మధునందన్, అమిత్‌కుమార్, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల, కెమెరామెన్ ఐ.ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.
తాత నుంచి మనవుడు నాగచైతన్య క్రమశిక్షణ, నటనతోపాటు మంచి అలవాట్లు పెద్దలను గౌరవించు నేర్చుకున్నాడంటూ తెగ పొగిడేశారు. మరలా నాగచైతన్యతో నటించాలనే కోరికను వ్యక్తం చేస్తూ... మరోసారి అవకాశం ఇవ్వడమని అడిగేశారు.
అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ... ఇది లవ్‌స్టోరీయే కాదు, మంచి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్‌గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ రావాలంటే కంప్లీట్ ఫ్యామిలీ వుండాలి. థాంక్యూ టు 'ఒక లైలా కోసం' ఫ్యామిలీ.