బాహుబలి హిందీ రైట్స్: యూటీవీ మోషన్ పిక్చర్స్ సొంతం!

శనివారం, 24 జనవరి 2015 (12:35 IST)
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా విడుదలకు ముందే రికార్డులు సొంతం చేసుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకునే ఈ సినిమా రైట్స్‌ను ఇప్పటికే తమిళంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో సొంతం చేసుకుంది. 
 
అలాగే హిందీలో రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. యాష్ రాజ్ ఫిలిమ్స్ అండ్ యూటీవీ మోషన్ పిక్చర్స్ బాహుబలి రైట్స్‌ను కైవసం చేసుకుంది.  హిందీలోనూ బాహుబలికి భారీ అంచనాలున్నాయి. కాగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న బాహుబలి సినిమాను విదేశా భాషల్లోనూ డబ్ చేశారు.  

వెబ్దునియా పై చదవండి