అబ్బో.. తమన్నాతో "వానా వానా వెల్లువాయో" చాలా హాట్ గురూ: రామ్ చరణ్

బుధవారం, 9 నవంబరు 2011 (12:39 IST)
WD

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ హిట్ కోసం తీవ్రంగా కృషి చేస్తూ నటిస్తున్న చిత్రం రచ్చ. ఈ చిత్రానికి సంబంధించిన పాట ఒకటి ఇటీవల చిత్రీకరించారట. ఇది వాన పాట. పైగా మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్‌లో విజయశాంతితో కలిసి స్టెప్పులేసిన వానా వానా వెల్లువాయే పాటకు రీమిక్సే ఈ సాంగ్.

ఈ సాంగ్‌లో తడిసిన అందాలతో తమన్నాతో రామ్ చరణ్ ఇద్దరూ వానా వానా వెల్లువాయే అంటూ వానలో నాట్యం చేస్తారట. ఈ పాట చాలా హాట్‌గానూ సెక్సీగానూ ఉందని రామ్ చరణే స్వయంగా తన ట్విట్టర్‌లో ట్వీట్ ఇచ్చాడు. కనుక రామ్ చరణ్ వానా వానా వెల్లువాయే అంటూ థియేటర్లలో త్వరలో రచ్చ చేయనున్నాడన్నమాట.

వెబ్దునియా పై చదవండి