కాల్‌మీ జస్ట్ రామ్ చరణ్ అంటున్న చెర్రీ!!

బుధవారం, 2 మే 2012 (11:35 IST)
File
FILE
తన పేరులో తేజ లేదని అందువల్ల తనను జస్ట్ రామ్ చరణ్ అని పిలిస్తే సరిపోతుందని 'రచ్చ' హీరో రామ్‌చరణ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం తెల్సిందే.

ఈ సెంటిమెంట్లు ఒక్క పేరులోనే కాకుండా.. తమ చిత్రాల్లో కూడా వారు విధిగా పాటిస్తుంటారు. ఈ కోవలో మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కూడా చేరాడు. తనను అందరూ రామ్ చరణ్ తేజ అని పిలుస్తుండటంతో చెర్రీకి ఏమాత్రం రుచించలేదు.

దీంతో చెర్రీ స్వయంగా కలుగజేసుకుని తనను జస్ట్‌ రామ్‌చరణ్‌ అని పిలిస్తే సరిపోతుందన్నారు. తన పేరులో తేజ లేదన్నారు. తన తొలి చిత్రం 'చిరుత' టైటిల్స్‌లో కూడా లేదని గుర్తు చేశాడు. అందువల్ల తనను అందరూ రామ్ చరణ్ అని సంబోధిస్తే సరిపోతుందని విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రస్తుతం 'జంజీర్‌'లో రామ్‌చరణ్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తుండగా, "ఎవడు"లోనూ పోలీసుగా నటిస్తున్నాడు. చెర్రీ తాజా చిత్రం రచ్చ విడుదలై మంచి సక్సెస్‌ను సాధించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి