కృతి కర్బందా లవ్ ఎఫైర్ విత్......?

శనివారం, 2 మార్చి 2013 (13:30 IST)
WD
మంచి అందగత్తెగా పేరు తెచ్చుకున్నప్పటికీ క్రేజీ కథానాయిక కాలేకపోయిన బాలీవుడ్ భామ కృతి కర్బందా ఇప్పుడు క్రేజీ లవర్‌గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు కృతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వరుస అపజయాలతో ప్లాప్ షో కనబరుస్తున్న కృతికి తాజాగా రామ్ సరసన నటించిన ఒంగోలు గిత్త ఫర్వాలేదనిపించడంతో ఊపిరిపీల్చుకుంది.

ఈ బ్యూటీ ఓ వారసత్వ హీరోతో ప్రేమాయణం నడుపుతోందని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కెరీర్‌లో ఒకే ఒక్క హిట్ నమోదు చేసుకున్న ఈ హీరో కృతితో సీరియస్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నడని సమాచారం. వీలైతే పెళ్ళిచేసుకునేందుకు కూడా ఇద్దరూ రెడీ అయ్యారట.

కృతి కెరీర్, సదరు హీరో కెరీర్ కూడా అంతంత మాత్రంగానే వుండటంతో వీలైనంత త్వరగా పెళ్ళి చేసుకుంటే ఓ పనైపోతుందనుకుంటున్నట్లు తెలిసింది. ఆ హీరోగారికి ఇప్పటికే పెళ్ళై విడాకులు కూడా అయిన నేపథ్యంలో వీరి మ్యారేజ్‌కు అడ్డంకులు ఉండవంటున్నారు. ఐతే ఇలాంటి వార్తలను తాను పట్టించుకోనని కృతి కొట్టిపారేస్తోంది.

వెబ్దునియా పై చదవండి