కొత్తవారికోసం శేఖర్ కమ్ముల సెర్చ్.. అంతా ఉత్తుత్తిదేనా.?!!

WD
అంతా కొత్తవారితో చిత్రాలను నిర్మిస్తున్నాననే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి తాను నిర్మించబోయే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంకోసం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలకోసం వేట మొదలుపెట్టారు. గతంలోనూ అచ్చమైన తెలుగువారిని తీసుకుంటామని.. తెలుగు సరిగ్గా మాట్లాడలేని ఎన్నారై ఫ్యామిలీకి చెందినవారిని, ఇండస్ట్రీ ఫ్యామిలీలకు అవకాశాలు ఇచ్చారు. ఈసారి అంతా తెలుగువారినే తీసుకుంటానని అంటున్నాడు.

1999లో డాలర్ డ్రీమ్ నిర్మించిన చంద్రశేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లీడర్ తర్వాత కొత్తవారితో కథను రాసుకున్నాను. అందుకే "హ్యాపీడేస్"లోలాగా కొత్తవారికి అవకాశం కల్పించాలని సెర్చ్ మొదలుపెట్టాం. ఈ అవకాశాన్ని తెలుగు అమ్మాయిలు, అబ్బాయిలు సద్వినియోగం చేసుకోండి. ఈ చిత్ర కథ కాస్త హ్యాపీడేస్‌కు దగ్గరగా ఉంటుంది.

రేడియో మిర్చి ద్వారాగానీ, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ amigoscreations డాట్ కామ్ చూసి మిగిలిన వివరాలు తెలుసుకోండి అన్నారు. అయితే హ్యాపీడేస్‌కు టాలెంట్ సెర్చ్ పెట్టి ఫైనల్‌గా ఆర్థిక స్తోమత గల ఎన్నారై ఫ్యామిలీకి చెందినవారిని, ఇండస్ట్రీ ఫ్యామిలీలకు అవకాశమిచ్చారు. సామాన్యులకు అవకాశాలిచ్చిన దాఖలాలు లేవు. మరి ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి...!!

వెబ్దునియా పై చదవండి