గంగతో రాంబాబులో "ఎక్కడో నరమ్ నలిగిపోతుందంటా..." ఐటం సాంగ్‌!

ఆదివారం, 1 జులై 2012 (13:05 IST)
పూరీ జగన్నాథ్‌ తన చిత్రాల్లో ఐటం సాంగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడు. పోకిరిలో అది ఫేమ్‌లోకి వచ్చింది. బిజినెస్‌మేన్‌‌లో కూడా అంతే. తాజాగా పవన్‌తో చేస్తున్న కెమెరామెన్‌ గంగతో రాంబాబులో ఓ ఐటం సాంగ్‌కు ప్లాన్‌ చేశాడు. సారథి స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.

ఇందులో బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియెలాతో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. గబ్బర్‌సింగ్‌లో రౌడీల నుంచి ఇన్‌ఫర్‌మేషన్‌ రాబట్టే సీన్‌ను హరీష్‌ శంకర్‌ చేసినట్లుగానే... ఇందులో విలన్స్‌ను చాకిరేవుపెట్టే సన్నివేశం చేస్తున్నట్లు తెలిసింది. విలన్స్‌ చీరలో కన్పిస్తే.. ఐటంగాళ్స్ మాత్రం రెండు గుడ్డపీలికలు కట్టుకుని.. 'ఎక్కడో నరమ్‌ నలిగిపోతుందంటూ..' పాడుతుందట. మరి ఈ ఐటంసాంగ్‌ ఏ మేరకు పేలుతుందో..

వెబ్దునియా పై చదవండి