ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారంటూ సన్నీ లియోన్ గోలగోల

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:39 IST)
File
FILE
తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారంటూ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ముంబై పోలీసుల ముందు గోలగోల చేసిందట. ఈ మధ్య రేప్ అంటే.. నేరం కాదనీ.. అది అనుకోకుండా జరిగే సెక్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను సన్నీ లియోన్ చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై దేశంలోని మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

దీంతో తేరుకున్న ఈ ఇండో కెనడియన్ పోర్న్ స్టార్.. ఆ వివాదం నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. సెక్స్ ఈజ్ నాట్ ఓ క్రైమ్.. ఇట్స్ సర్‌ప్రైజ్ సెక్స్ అంటూ తాను ట్విట్ చేయలేదని పేర్కొంది. తన ట్విట్టర్ అకౌంట్‌ను బాలీవుడ్ నటుడు కమాల్ రషీద్ ఖాన్ హ్యాక్ చేసి ఈ ట్విట్ చేశాడని సన్ని లియోన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో ఆగ్రహించిన రషీద్ ఖాన్ ఆమెపై ఏకంగా నాలుగు కేసులు పెట్టించారు. సన్నిలియోన్, ఆమె భర్త కలిసి పవిత్ర భారత దేశంలో పోర్న్ సినిమాలను ప్రచారం చేస్తున్నారని, మిడ్డీలతో యువతను రెచ్చగొట్టేవిధంగా డ్యాన్స్ చేస్తోందంటూ తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ రెండు ఫిర్యాదులను స్వీకరించిన ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి