తాప్సీ లెగ్ ఐరెన్ లెగ్గా... షాడో... గుండెల్లో గోదారి విడుదల కావేంటి...?!!

గురువారం, 3 జనవరి 2013 (13:41 IST)
WD
తెల్లపిల్ల తాప్సీ లెగ్ ఐరెన్ లెగ్గయిపోయిందా.... అనే అనుమానం టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోందట. దీనిపై ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నాయి. తాప్సీది ముమ్మాటికీ ఐరెన్ లెగ్‌గా మారిందని అందువల్ల ఆమె నటించిన సినిమాలు విడుదలవడం లేదని చెపుతున్నారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న షాడో చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఐతే ఈ చిత్రం సంవత్సర కాలంలో గూడ్సు బండిలా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ పట్టాన పూర్తి కావడంలేదు. మరోవైపు మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న మరో చిత్రం గుండెల్లో గోదారి.

ఈ చిత్రంలో కూడా తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రం సెన్సార్ పూర్తయినప్పటికీ విడుదల కావడంలో జాప్యం నెలకొన్నది. దీంతో తాప్సీ లెగ్ ఐరెన్ లెగ్గయిపోయిందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి