ధనుష్ - శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా ముదిరిపోయిందట

బుధవారం, 4 జనవరి 2012 (20:46 IST)
FILE
కొలవెరి పాటతో అంతర్జాలంలో బాగా పాపులర్ అయిన "3" జోడీ ధనుష్ - శృతిహాసన్. 3 సినిమా కోసం స్వయంగా ధనుష్ భార్య ఐశ్వర్య ఇద్దరిచేత హాట్ హాట్ ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడదే ఊపుతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ముదిరిపోయిందని కోలీవుడ్ సినీజనం తెగ చెప్పుకుంటున్నారు.

ధనుష్ తన తదుపరి రెండు చిత్రాల్లో శృతిహాసన్ ను హీరోయిన్‌గా బుక్ చేయించాడని చెపుతున్నారు. ఐతే ఒక సినిమాలో కలిసి నటిస్తే చాలు.. ఇటువంటి గాలి వార్తలను పుట్టించి ప్రచారం చేయడం కొంతమందికి అలవాటైపోయిందని ధనుష్ - శృతి సన్నిహితులు మండిపడుతున్నారట.

అంతేకదా.. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. గ్లామర్ తారలు ఎక్కడికెళ్లినా.. ఎవరితో మాట్లాడినా కెమిస్ట్రీ ఉందని అంటారు పాడుజనం.

వెబ్దునియా పై చదవండి