నటనా వారసత్వలో సత్తా చాటుతున్న రామ్ చరణ్

ఆదివారం, 8 ఏప్రియల్ 2012 (15:53 IST)
File
FILE
అతను మాస్ హీరో.. అతని డాన్స్ అంటే జనం ఊగిపోతారు. ఒక్క మాస్ ఆడియన్సే కాదు.. క్లాస్ పీపుల్ అభిమానం సంపాదించుకున్న స్టార్ ఆయన. స్టార్ నుంచి మెగాస్టార్ అయిన చిరంజీవి.. ఇపుడు టాలీవుడ్ లెజండ్.

ఇప్పుడు తండ్రి బాటలో ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొద్ది కాలంలోనే ఫ్యాన్స్ అభిమానం దోచుకున్న యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ డాన్స్‌ల్లో కూడా తాను తక్కవేం కాదని తాజాగా "రచ్చ" చిత్రంతో నిరూపించాడు.

'ఘరానా మొగుడు' చిత్రంలోని 'బంగారు కోడి పెట్ట' సాంగ్‌కు చిరంజీవి రేంజ్‌లో స్టెప్పులేశాడు చెర్రీ. అంతేకాదు తాజాగా "రచ్చ" సినిమాలో కూడా ఇలాంటి ప్రయోగానే రామ్ చరణ్ చేశాడు.

'గ్యాంగ్ లీడ'ర్‌లోని "వానవాన వెల్లువాయె" పాటకు తన స్టెప్పులు కలిపాడు. మొత్తానికి తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి