నాలో ఆ రెండూ సిల్క్ స్మితకున్నట్లే ఉంటాయి... బిందుమాధవి

శుక్రవారం, 28 జూన్ 2013 (11:47 IST)
WD
తెలుగు నటిగా పేరుపొందిన బిందుమాధవి పలు చిత్రాలు చేసినా.. పెద్దగా పేరు రాలేదు. బంపర్‌ ఆఫర్‌, పిల్లజమిందార్‌ చిత్రాలు చేసినా కొద్దిగా పేరువచ్చింది. కానీ అవేవీ ఆఫర్లుకు అవకాశాలు కల్పించలేకపోయింది. ప్రస్తుతం గ్లామర్‌ పాత్రలకైనా రెడీ అంటు స్టేట్‌మెంట్‌ ఇస్తోంది.

తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. దీంతో ఆమె పాత్రలు గ్లామర్‌గా మారిపోయాయి. ఆ పాత్రలకే పేరు వచ్చింది. తెలుగులో కూడా గ్లామర్‌ రోల్స్‌ చేస్తానని అంటోంది. ఇంతకీ ఈమెను తమిళ నిర్మాతలు... అలనాటి సిల్క్‌స్మితను ఈమె కళ్ళలో చూసుకుంటున్నారట.

సిల్క్ స్మిత కళ్ళు ఈమెకు దగ్గరగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారట. వారు చెప్పింది కరెక్టేనంటూ... తాను చిన్నప్పుడు సిల్క్‌స్మిత ఫ్యాన్‌ అని బిందు చెబుతోంది. మరి ఆమెకు అటువంటి పాత్రలు చేయాలనుందనుకుంటా.

వెబ్దునియా పై చదవండి