నా సినిమాలను పిల్లలు కూడా చూస్తారు: ముమైత్

టాలీవుడ్ ఐటంగర్ల్, సెక్సీడాళ్ ముమైత్‌ఖాన్ రూటు మార్చింది. ఎప్పుడూ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కించే ముమైత్ ఇకపై తన చిత్రాలను పిల్లల కూడా చూస్తారని స్టేట్‌మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. 

ముందుతరం జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్‌స్మిత తర్వాత డిస్కోశాంతి అలా భారీ అందాల ఊపులతో కసెక్కించే చూపులతో వెండితెరపై కుర్ర ప్రేక్షకుల హృదయాలను దడదడలాడించిన ముమైత్‌ఖాన్‌ ఇప్పుడు తన నడవడికను మార్చుకొంటానంటోంది.

ఇప్పటివరకు సెక్సీ అందాలతో అదరగొట్టిన ముమైత్ లేడీ ఓరియెంటెండ్‌ పాత్రలు చేస్తానని చెబుతోంది. ఇప్పటికే పున్నమినాగు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముమైత్ ఖాన్ తాజాగా హిందీ, తెలుగులో భాషల్లో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తోంది.

ఇందులో చీరకట్టి అందర్ని ఆశ్చర్యపరిచిన ముమైత్, ఇకపై తాను నటించే చిత్రాలు పిల్లలుకూడా చూసేట్లుగా ఉంటాయని చెప్పింది.

మరి ఇటీవలే రామ్‌చరణ్‌ "మగధీర"లో "బంగారు కోడిపెట్ట"గా నటించారు కదా? అని అడిగితే..? అదేం అంత ఎక్స్‌పోజింగ్‌ కాదు గదా. అంతకంటే ఎక్కువ చూపించే సినిమాలు చేయనని అంటోంది. మరి ఈ మాట మీదనే ముమైత్ నిలుస్తుందో? లేదో వేచిచూడాల్సిందే..!.

వెబ్దునియా పై చదవండి