నితిన్ నన్ను వాడుకుని చీట్ చేశాడు... గుత్తా జ్వాల....!

మంగళవారం, 14 మే 2013 (20:49 IST)
WD
ఇటీవల వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నితిన్‌తో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఈ ఐటెం సాంగ్ ద్వారా మంచి అవకాశాలు వస్తాయని భావించిన గుత్తాజ్వాలకు అవకాశాలు రాకపోగా తనలోని లోపాలు బయటపడ్డట్టు తెలియవచ్చింది. అందుకు హీరో నితిన్ కారణమని అతను తనను చీట్ చేశాడంటూ గుత్తాజ్వాల అంటున్నట్లు సమాచారం.

నితిన్‌తో ఫ్రెండ్‌షిప్ కారణంతో గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో గుత్తాజ్వాల నటించింది. అయితే ఈ సినిమా ద్వారా మంచి ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ ఇప్పుడు అవకాశాలు రావడం లేదు సరి కదా, ఆమె గ్లామర్ అందాల గురించి నెగటివ్‌గా మాట్లాడుకుంటున్నారట. పైగా గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో గుత్తా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డ్యాన్స్ పెద్దగా చేయలేదు. నువ్వు పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయినా ఫర్వాలేదు, కనిపిస్తే చాలు అని నితిన్ చెప్పడంతో చిన్న చిన్న స్టెప్పులతో కానిచ్చేసిందట.

నితిన్ అలా చెప్పి ఉండకపోతే బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేసేదాన్ననీ, అప్పుడు మంచి మార్కులు వచ్చివుండేవని, తన సినిమాకు ఉపయోగించుకున్నాడే తప్ప తనకు క్రేజ్ రాకుండా చేసి నితిన్ తనను చీట్ చేశాడని గుత్తా అంటున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి. గుత్తా గ్లామర్‌ నిజంగా నితిన్‌కు ఉపయోగపడిందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి