ఫ్రెండ్ పెళ్లిలో... సిద్దార్థ్ - సమంతల పెళ్లి మ్యాటర్....!

బుధవారం, 28 ఆగస్టు 2013 (16:57 IST)
FILE
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, లవర్ బాయ్ సిద్దార్థ్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలతో సమంత బిజీగా ఉంటే, ప్రియుడు సిద్దార్థ్ తమిళ సినిమాలలో బిజీగా ఉన్నాడు. తాజాగా వీరిద్దరూ ఓ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో సమం, సిద్దార్థ్‌లు పెళ్లికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇటీవలే జరిగిన సిద్దార్థ్ ఫ్రెండ్ పెళ్ళికి సమంత కూడా హాజరయింది. అక్కడ వీరిద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారట. చాలా రోజుల గ్యాప్ తరువాత వీరిద్దరు కలవడంతో కాసేపు కష్టసుఖాలను చెప్పుకుని తర్వాత పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిని బట్టి చూస్తే త్వరలోనే ఈ పెళ్లి జరిగే అవకాశం ఉందని చెన్నై వర్గాలు అనుకుంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి