'మగధీర'తో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లోని ఇతర హీరోయిన్లతో పోల్చితే లక్కీ గర్ల్. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఐదు భారీ చిత్రాల్లో నటించనుంది. ఇందులో ఒకటి ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రమే ప్రిన్స్ మహేష్ బాబు 'బిజినెస్‌మేన్'. ఇది కాకుండా మరో నాలుగు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసింది.
వాస్తంగా టాలీవుడ్‌లో యువ హీరోయిన్లలో సమంతే మొదటి స్థానంలో ఉన్నారు. అయితే, ఈ యేడాది భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఎంపికైన ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్‌కే మొదటి స్థానం దక్కిందని చెప్పొచ్చు. ఆ కోవలో తమిళంలో సూర్య, విజయ్ సరటన నటించేందుకు ఎంపికైంది.
అలాగే, టాలీవుడ్ విషయానికి వస్తే.. 'మగధీరుడు' రామ్‌చరణ్‌తో వివివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర' తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే జూన్ నుంచి ప్రారంభంకానుంది. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్-కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో లోగడ 'బృందావనం' అనే చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.